నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కూడలి వద్ద సోమవారం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. 44వ నెంబర్ జాతీయ రహదారిపై లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో జాఫర్బీన్ అబ్దుల్లా అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
నిజామాబాద్‌కు చెందిన అబ్దుల్లా నిర్మల్‌లోని తమ బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా.. నిర్మల్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఘటనలో తీవ్ర గాయాలైన అబ్దుల్లా అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేశ్ తెలిపారు.