ETV Bharat / jagte-raho

కూలీల ట్రాక్టర్​ బోల్తా... ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 25 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్​... బొల్తాపడి ఇద్దరు మృతి చెందారు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

Road accident at kamareddy district
కూలీల ట్రాక్టర్​ బోల్తా... ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
author img

By

Published : Aug 5, 2020, 7:54 PM IST

కామారెడ్డి జిల్లాలో మహారాష్ట్రకు చెందిన కూలీల ట్రాక్టర్​ బోల్తా పడి.. ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని నేరంగల్​ గ్రామం నుంచి మద్నూర్​ మండలం డోంగ్లి గ్రామానికి 25 మంది ట్రాక్టర్​లో కూలీ పనుల కోసం వచ్చారు.

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని డోంగ్లీ గ్రామానికి సమీపంలో ఉండటం వల్ల నేరంగల్ కూలీలు సోయాలో కలుపు తీసేందుకు వచ్చారు. కూలీపనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో.. మద్నూర్ మండలం సమీపంలో మూలమలుపు వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది.

ఘటనా స్థలంలోనే యశ్వంత్, మారుతీ అనే ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.