ETV Bharat / jagte-raho

బెడిసికొట్టిన రిపోర్టర్​ డీలింగ్​... ట్రాప్​లో పడి కిడ్నాప్​

అన్యాయాన్ని అడ్డుకునేందుకు బయలుదేరిన ఆ రిపోర్టర్​... తీరా నిందితుల్ని పట్టకున్నాక యూటర్న్​ తీసుకుని యజమానితో డీలింగ్​ మాట్లాడాడు. బేరం కుదరకపోయే సరికి పోలీసులకు చెప్తానని బెదిరించాడు. రిపోర్టర్​ ప్లాన్​ అర్థమైన నిందితులు... అతని రూట్లోనే వెళ్లి ట్రాప్​ చేశారు. కిడ్నాప్​ చేసి చివరకు పోలీసులకు దొరికిపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన మేడ్చల్​ జిల్లా దుండిగల్​ ఫరిదిలో జరిగింది.

reporter high drama kidnap in dhundigal
reporter high drama kidnap in dhundigal
author img

By

Published : Sep 16, 2020, 11:08 PM IST

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న సమాచారంతో రెడ్​హ్యాండెడ్​గా పట్టుకుందామని వెళ్లిన ఓ యూట్యూబ్​ ఛానల్​ రిపోర్టర్​... కిడ్నాప్​నకు గురైన ఘటన మేడ్చల్​ జిల్లా దుండిగల్​లో చోటుచేసుకుంది. షాపూర్​నగర్​కు చెందిన అజ్మత్ అలీ (32) ఓ యూట్యూబ్ ఛానల్​లో రిపోర్టర్​గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి గాజులరామరం నుంచి ఆటోలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారం అందుకున్నాయి. వెంటనే నలుగురు స్నేహితులతో.. కలిసి రొడామేస్ట్రీనగర్​లో ఆటోను పట్టుకున్నారు.

reporter high drama kidnap in dhundigal
బెడిసికొట్టిన రిపోర్టర్​ డీలింగ్​... ట్రాప్​లో పడి కిడ్నాప్​

రూ.2 లక్షలు డిమాండ్​...

ఆటోలో ఉన్న ముగ్గురిని బంధించి వారి యజమానికి ఫోన్ చేసి రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. నగదు ఇవ్వకుంటే పోలీసులకు పట్టిస్తామని బెదిరించారు. కైసర్​నగర్ వద్దకు యజమాని రమ్మనగా... వెళ్లారు. అక్కడ బేరసారాలు కుదరకపోవటం వల్ల పోలీసులకు సమాచారం అందించారు.

రిపోర్టర్​నే కిడ్నాప్​ చేశారు...

కొందరు వ్యక్తులు కారులో వచ్చి ఆటోను అప్పగించాలని కోరగా... లక్ష రూపాయలిస్తే వదిలేస్తామన్నారు. డీల్​కు ఒప్పుకున్న వ్యక్తులు... డబ్బులు మియపూర్​లో ఇస్తామని అజ్మత్ అలీని కారులో ఎక్కించుకున్నారు. కారులో వెళ్లిన స్నేహితుడు ఎంతసేపటికీ తిరిగి రాకపోవటంతో మిగతావారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫోన్​ సిగ్నల్స్​ ఆధారంగా...

వెంటనే స్పందించిన పోలీసులు అజ్మత్ అలీ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అజ్మత్​అలీని అనేక ప్రాంతాలు తిప్పి చివరకు తాండూరు తీసుకెళ్లినట్లు గుర్తించారు. విషయం పోలీసులకు తెలిసిందన్న సమాచారంతో అజ్మత్అలీని అక్కడే వదిలేశారు. కిడ్నాపర్లు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉన్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: డాలర్లు పంపిస్తానని నమ్మించి రెండు లక్షలు కొట్టేశాడు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.