ETV Bharat / jagte-raho

ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం - వికారాబాద్ జిల్లా నేర వార్తలు

వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం మోమిన్ కలాన్​లో దారుణం జరిగింది. అన్నం పెట్టమని పిలిచి.. అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడో ప్రబుద్ధుడు.

Rape Attempt in vikarabad on  Eight years girl
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం
author img

By

Published : Oct 3, 2020, 8:43 AM IST

వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం మోమిన్ కలాన్​లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఇంటిముందు ఆడుకుంటున్న బాలికను రాములు(40) అనే వ్యక్తి అన్నం పెట్టమని పిలిచి దారుణానికి ఒడిగట్టాడు.

అతని నుంచి తప్పించుకున్న బాలిక ఇంట్లో వారికి చెప్పడంతో 100 కు డయల్ చేశారు. పోలీసులు బాలికను సఖి కేంద్రానికి తరలించి వివరాలు సేకరించారు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ధరూర్ సీఐ మురళీకృష్ణ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.