ETV Bharat / jagte-raho

ప్రమాదం: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి..! - నాగర్​కర్నూల్​ నేరవార్తలు

నాగర్​ కర్నూల్​ జిల్లా జడ్చర్ల కల్వకుర్తి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. అయితే వేగ నియంత్రణ బోర్డులే ప్రాణాలు తీశాయని పలువురు ఆరోపిస్తున్నారు.

raod accident at Jadcharla Kalvakurthi Main Road
ప్రమాదం: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
author img

By

Published : Sep 5, 2020, 10:26 AM IST

నాగర్​ కర్నూల్​ జిల్లా జడ్చర్ల కల్వకుర్తి ప్రధాన రహదారిపై ఊర్కొండ గేటు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కొట్ర గ్రామానికి చెందిన సురేష్​(35)గా గుర్తించారు. బోయిన్​పల్లి గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్తూ.. ప్రమాదానికి గురై మృతి చెందారని వివరించారు.

అయితే వేగ నియంత్రణ బోర్డులే ప్రాణాలు తీశాయని పలువురు ఆరోపిస్తున్నారు. వాహనాల వేగ నియంత్రణ కోసం ఊర్కొండ గేటు సమీపంలో ఏర్పాటు చేసిన ఇనుప బోర్డులే ద్విచక్రవాహనదారుడి ప్రాణాలు తీశాయని అంటున్నారు. చీకటి పూట ప్రయాణం చేస్తుండటం వల్ల వాటిని ఢీకొట్టి మృతి చెందాడని అనుమానిస్తున్నారు.

ప్రమాద ఘటనలో రహదారిపై ఉన్న సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నా... వీధి దీపాలు వెలుగకపోవడంతో.. ప్రమాదం ఎలా జరిగిందో గుర్తించేందుకు అవకాశం లేకపోయిందని పలువురు విమర్శిస్తున్నారు.

ఇదీ చదవండి: నేర్పాలంటే... నేర్చుకోవాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.