ETV Bharat / jagte-raho

చదువుకునే రోజుల్లో ప్రేమించాడు.. ఉద్యోగం వచ్చాక వదిలేశాడు...

చదువుకునే రోజుల్లో ప్రేమిస్తున్నానని తీయని కబుర్లెన్నో చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. తీరా ఉద్యోగం రాగానే.. ముఖం చాటేశాడు. ప్రేమించి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. పట్టించుకోవాల్సిన పోలీసులే.. మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించారు. ఇష్టం వచ్చినట్లు చితకబాదారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆ మహిళ మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించి తనకు న్యాయం జరిగేలా చూడమని కోరింది.

ramojipet woman went to telangana human rights commission as she was cheated by a teacher
హెచ్​ఆర్సీని ఆశ్రయించిన రామోజీపేట యువతి
author img

By

Published : Aug 27, 2020, 12:43 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామానికి చెందిన మంజుల ఎంఏ ఎంఫిల్ పూర్తి చేసింది. 2016లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్​) ప్రిపరేషన్​ కోసం హైదరాబాద్​లోని ఓయూకు వచ్చింది. అదే టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆదిలాబాద్ జిల్లా విగాపూర్ గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి రాజుతో ఓయూలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మరింది.

కొన్నిరోజుల తర్వాత తిప్పిరెడ్డి రాజుకు ప్రభుత్వ ఉద్యోగం రావడం వల్ల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చేరాడు. అప్పటి నుంచి ఫోన్ చేసినా మాట్లాడకపోవడం వల్ల నేరుగా అతని దగ్గరకి వెళ్లి నిలదీసింది. అతను పట్టించుకోకపోవడం వల్ల ఓయూ, ఇచ్చోడా, వాగపూర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. ఇచ్చోడా పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోకపోగా… తనను చితకబాది అసభ్య పదజాలంతో దూషించారని ఆందోళన వ్యక్తం చేసింది.

తనను పెళ్లిచేసుకుంటానని శారీరకంగా వాడుకొని వదిలేసిన తిప్పారెడ్డి రాజుపై, ఇచ్చోడా పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించింది. తనను పెళ్లి చేసుకోకపోతే తిప్పిరెడ్డి రాజును ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించాలని కమిషన్​ను కోరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.