ప్రజలను కరోనా వైరస్‌తో చంపేందుకు ఉచితంగా మాస్కులు పంచుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నమ్మొద్దని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ సుచించారు. సామాజిక మాధ్యమాల్లో ఆడియో క్లిప్‌లను పోస్ట్ చేస్తున్నారని... అవన్నీ అవాస్తవమని తెలిపారు.
ప్రజలు ఇలాంటి అసత్య వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని సీపీ విజ్ఞప్తి చేశారు. ప్రజలను భయాందోళనకు గురి చేసే వార్తలు ప్రచారం చేసినా.. షేర్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని మహేశ్ భగవత్ హెచ్చరించారు.