మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పోలంపల్లి తండాలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 125 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. వీటి విలువ రూ. 3 లక్షల ఉంటుందని తెలిపారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి వెల్లడించారు.
పోలంపల్లి తండాకు చెందిన బాదావత్ శంకర్, తేజావత్ లక్ష్మణ్‌లు రేషన్ డీలర్లు.. పలువురు దగ్గర తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి.. బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల కమీషన్ పెంచినా.. అక్రమ దందాను కొనసాగిస్తున్నారన్నారు. నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. దందాను గుట్టురట్టుచేసిన సిబ్బందిని అభినందించారు.
ఇవీచూడండి: సైబర్ నేరగాళ్ల ఎర.. ఆరుగురు టార్గెట్