హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రి భవనం 3వ అంతస్తు నుంచి దూకి శేఖర్ అనే రోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాలుగు రోజులుగా వైద్యులు సరైన వైద్యం అందించక నిర్లక్ష్యం వహించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని తల్లి సుకమ్మ ఆరోపించింది.
ఐడీపీఎల్‌లో నివాసముంటున్న శేఖర్ అనే వ్యక్తి అనారోగ్యానికి గురై.. చికిత్స కోసం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో చేరాడు. ఇతనికి రక్త కణాలు తక్కువగా ఉండడంతోపాటు ఊపిరితిత్తుల్లో ఇన్‌స్పెక్షన్ అయింది. చికిత్స చేయడంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. మూడో అంతస్తు నుంచి దూకాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రి సిబ్బంది ఎమర్జెన్సీ వార్డులో చేర్పించి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: దుర్గం చెరువు తీగల వంతెనపై ప్రమాదం