బహుళ అంతస్థుల భవనాలు... చుట్టూ అహ్లాదకరమైన పార్కు, స్విమ్మింగ్ పూల్, జనరేటర్ సౌకర్యం అంటూ రియల్టర్లు ప్రజలను నమ్మించి కొనిపిస్తారు. తీరా రిజిస్ట్రేషన్ అయ్యాక చూస్తే అన్నింటా నాణ్యత లోపం... మూడు నాలుగు నెలల క్రితం హైదరాబాద్లోని ఓ అపార్టుమెంట్ పార్కులో ఆడుకుంటున్న బాలుడు పక్కనే ఉన్న విద్యుత్ తీగ తగిలి ప్రాణాలొదిలాడు. నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అత్తాపూర్లోని జనప్రియ అపార్టుమెంట్లో నాణ్యతలేని సిమెంట్ బల్ల మీద పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. సకల సౌకర్యాల పేరుతో ఫ్లాట్లను కొనిపించి ప్రజలను మోసం చేస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియట్లేదని ఆవేదన చెందుతున్నారు. ఆరేళ్ల బాలుడి మృతికి నిర్వాహణ లోపమే కారణమని అపార్ట్మెంట్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి:హైదరాబాద్లో 'ఊబర్' ఎలక్ట్రిక్ కార్ల పరుగులు