ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని మరిప్రోలువారిపాలెంలో విషాదం నెలకొంది. వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వీరారెడ్డి, భార్య వెంకటరమణ, కూతురు విషాహారం తిని బలవన్మరణానికి పాల్పడ్డారు. బంధువులు గమనించి స్థానికి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే భార్య, కూతురు మరణించారు. మెరుగైన చికిత్స కోసం వీరారెడ్డిని గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు.
మనస్థాపంతోనే...?
గ్రామంలో పొలం దగ్గర ఉండే నీటి మోటర్‌ను దొంగిలించారని వీరారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై పోలీసులు ప్రతి రోజు విచారణ పేరుతో పిలుస్తున్నారని మనస్థాపానికి గురైన కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: తెలంగాణ: ఆ తొమ్మిది మంది హత్యకు కారణం ప్రేమ!