బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా పెద్ద పడిశాల సమీపంలో చోటుచేసుకుంది. ఆత్మకూరు(ఎం) మండలం ఖప్రాయపల్లికి చెందిన కొంగరి రాములు(35) వస్తా కొండూరులోని బంధువుల ఇంటికి వచ్చి వెళ్తున్నాడు.
ఈ క్రమంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడి తలకు బలమైన గాయం తగిలింది. దీంతో అక్కడికక్కడే ఆ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.
ఇదీ చూడండి : గురువు మందలించారని విద్యార్థి ఆత్మహత్య