ETV Bharat / jagte-raho

గోదావరిలో మునిగి జవాను మృతి.. మరొకరి కోసం గాలింపు - గోదావరిలో ఈతకు వెళ్లి యువకుడు మృతి

సరదాగా ఈత కొట్టేందుకు గోదావరి వద్దకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభించగా మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషాద ఘటన కోటపల్లి మండలంలో చోటు చేసుకుంది.

one young man died and one more person missed in godavari at mancherial district
ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు... ఒకరి మృతదేహం లభ్యం
author img

By

Published : Dec 15, 2020, 3:36 PM IST

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ఎర్రాయిపేట గ్రామ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. చెన్నూర్ పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు గోదావరి నదికి ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సీఐ నాగరాజు ఆధ్వర్యంలో జాలర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

ఇద్దరు యువకుల్లో ఒకరి మృతదేహం లభ్యంకాగా.. మరొకరి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఐ వెల్లడించారు. మృతుడు రాజ్​కుమార్​గా గుర్తించారు. అతను ఆర్మీలో పని చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: యువతి అనుమానస్పద మృతి.. ఫొటోలే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.