నారాయణ పేట జిల్లా ఊట్కూరు మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన శంకర్ చేపల వేటకు వెళ్లి విద్యాదాఘాతానికి గురై మృతి చెందాడు. గ్రామ సమీపంలోని సంగంబండ రిజర్వాయర్ బ్యాక్ వాటర్లో రోజువారిలాగానే చేపల వేటకు వెళ్తుండగా పంట పొలానికి వేసిన కరెంట్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
కాగా పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ విషయమై ఎస్సై అబ్దుల్ రషీద్‌ను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
ఇదీ చూడండి : ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా