ETV Bharat / jagte-raho

మరో నేపాలీ ముఠా చోరీ.. మత్తుమందు ఇచ్చి దొంగతనం - నాచారంలో నేపాలీ ముఠా చోరీ

మేడ్చల్​ జిల్లా నాచారం పరిధిలో నేపాలీ ముఠా చోరీ చేసింది. ఎప్పటిలానే ఓ ఇంట్లో పనిమనుషులుగా చేరి.. అదను చూసి ఇంటికి కన్నం వేశారు. కుటుంబ సభ్యులు విధుల నిమిత్తం బయటకు వెళ్లగా... ఇంట్లో ఉన్న వృద్ధురాలి నోట్లో మత్తుమందు గుడ్డ కుక్కి కావాల్సినంత దోచుకున్నారు. విలువైన వస్తువులు, పది లక్షల నగదు, ఇరవై తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.

మరో నేపాలీ ముఠా చోరీ.. మత్తుమందు ఇచ్చి దొంగతనం

author img

By

Published : Oct 20, 2020, 8:49 AM IST

వృద్ధురాలకి మత్తుమందు ఇచ్చి దొంగతనానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ మేడ్చల్​ జిల్లా నాచారం పోలీస్‌ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాచారం హెచ్‌ఎంటీ కాలనీలో నివాసముంటున్న ప్రదీప్‌ అనే వ్యక్తి ఇంట్లో పనిమనిషులుగా ఉన్న నేపాల్‌ దంపతులు అర్జున్, మాయ చోరికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు విధుల నిమిత్తం బయటకు వెళ్లగా అదను చూసి నేపాల్‌ దంపతులు ఇంట్లో ఉన్న వృద్ధురాలి నోట్లో మత్తుమందు గుడ్డను కుక్కి స్పృహా కోల్పోయేలా చేశారు.

అనంతరం ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, పది లక్షల నగదు, ఇరవై తులాల బంగారు ఆభరణాలు అపహారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత 14 రోజుల క్రితం ఓ ఏజెన్సీలో పనిచేస్తోన్న నేపాల్‌కు చెందిన రాజ్‌బహుదూర్ ద్వారా ప్రదీప్ ఇంట్లో పనిలో చేరారు.

గత రెండు రోజులుగా మాయ, అర్జున్‌ల వ్యవహార శైలి అనుమానస్పదంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేసును ఛేదించేందుకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు. వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో చేర్పించారు.

ఇదీ చదవండి: రాయదుర్గం చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.