నిర్మల్ జిల్లా కడెం మండలం ఆల్లం పల్లి గ్రామానికి చెందిన శంకర్ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం దంతనపల్లి పంచాయతీ పరిధిలో కొత్తగూడ సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
అల్లం పల్లికి చెందిన పెంబి రాజన్న ఎల్లవ్వకు ముగ్గురు కుమారులు. వారి రెండో కుమారుడు పెంబి శంకర్ వ్యవసాయం చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. తల్లికి సోదరుడికి పాదరక్షలు తీసుకువస్తానని మండల కేంద్రానికి వచ్చి పాదరక్షలు కొనుగోలు చేసి అలంపల్లికి తిరుగు ప్రయాణమయ్యాడు.
ఈ క్రమంలో కొత్తగూడా సమీపాన వ్యాను ఢీ కొట్టింది. తీవ్ర గాయాలపాలైన శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.