ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంచికచర్ల చెవిటికల్లు సెంటర్లో దంపతులు బండారుపల్లి నాగేశ్వరరావు, ప్రమీలరాణి మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నందిగామ సీఐ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ దంపతులకు కొడుకు, కుమార్తె ఉన్నారు. కుమారుడు విజయవాడలో.. కుమార్తె హైదరాబాద్లో ఉంటున్నారు. వారు ఇంటి దగ్గరే వుంటున్నారు.
పని మనిషి సాయంత్రం ఇంటికి వచ్చిన సమయంలో తలుపులు వేసి ఉన్నాయి. పిలిచినా.. ఎవరూ బయటకు రాకపోవడంతో చుట్టు పక్కల వారికి విషయం చెప్పింది. వారంతా కలిసి కిటికీలో నుంచి చూడగా పడక గదిలో ఇద్దరూ మృతి చెంది ఉన్నారు. స్థానికులు వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆభరణాల కోసమే హత్య చేసి ఉంటారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
ఇదీ చదవండి: సైబర్ 'ఛీ'టర్స్: అంతర్జాలమే పెట్టుబడి.. మోసంతోనే రాబడి!