నిజామాబాద్ దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని కంఠేశ్వర్ కాలనీలో జంట హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ అద్దె ఇంట్లో ఇద్దరు యువకుల మృతదేహాలను స్థానికులు గుర్తించారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి యజమాని గది తలుపులు తెరిచి చూశారు.
నాలుగు నెలల నుంచి ముగ్గురు యువకులు అద్దెకు ఉంటున్నారు. టీ కొట్టు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం యువకులు హత్యకు గురై ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో యువకుడి ఆచూకీ కోసం ఆరాతీస్తున్నారు.
ఇవీ చూడండి: హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల కోసం షటిల్ బస్సులు