ETV Bharat / jagte-raho

పంథా మార్చి న సైబర్​ నేరగాళ్లు.. పలువురికి బురిడీ

సైబర్‌ మోసాల్లో పేరు మోసిన జాంతార సైబర్‌ నేరగాళ్లు తమ పంథా మార్చి చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఎస్ఎంఎస్ టూ ఫోన్ యాప్​ను వినియోగించుకొని పలువురిని బురిడీ కొట్టిస్తున్నారు. లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. నెల రోజుల వ్యవధిలో ఈ తరహా నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సైబర్‌ క్రైం పోలీసులు రంగంలోకి దిగి లోతుగా విచారణ చేపట్టారు.

new online cyber crimes with sms to phone app
పంథా మార్చి న సైబర్​ నేరగాళ్లు.. పలువురికి బురిడీ
author img

By

Published : Aug 30, 2020, 4:50 PM IST

హైదరాబాద్​ కేపీహెచ్​బీ కాలనీకి చెందిన సాఫ్ట్​వేర్ ఇంజినీర్ కొద్దిరోజుల క్రితం ఇల్లు మారారు. తన బ్రాడ్​బాండ్ కనెన్షన్​ను కొత్త చిరునామాకు మార్పించేందుకు కస్టమర్ కేర్ నంబర్ కోసం అంతర్జాలంలో వెతికారు. సైబర్ నేరస్థులు పొందుపరిచిన నంబరే సరైనది అనుకొని ఆ నంబరుకు ఫోన్ చేశారు. ఈక్రమంలో సైబర్ మోసగాళ్లు అతన్ని మాటల్లోకి దింపి యూపీఐ ఖాతా, డెబిట్ కార్డు వివరాలు తెలుసుకున్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎస్ఎంఎస్ టూ ఫోన్ యాప్​ను నిక్షిప్తం చేసుకోవాలని సూచించారు. ఆనంతరం అతడి పేరుతో బ్యాంకులో పది లక్షల ఇన్​స్టంట్ రుణం మంజూరు చేయించి ఆ డబ్బును కొట్టేశారు. తన ప్రమేయం లేకుండానే ఖాతాలో అనూహ్యంగా డబ్బు జమ కావడం... వెంటనే మరో ఖాతాలోకి బదిలీ కావడం వల్ల బాధితుడు బ్యాంకును సంప్రదించగా మోసం బహిర్గతమైంది. ఈ వ్యవహారంపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పంథా మార్చారు..

సైబర్ నేరాల్లో ఆరితేరిన జంతార మోసగాళ్లు పంథా మార్చి తాజాగా ఎస్ఎంఎస్ టూ ఫోన్ యాప్​ను వినియోగించుకొని బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పటి వరకు పేటీఎం, గూగుల్ పే తదితర ఈ-కామర్స్ చెల్లింపు వ్యవస్థలతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డుల కేవైసీ నుంచి మాట్లాడుతున్నామని నమ్మించి యూపీఐ ఖాతా, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను తెలుసుకునేవారు. అనంతరం చరవాణిలో ఎనీడెస్క్, క్విక్ సపోర్ట్, టీమ్ వ్యూయర్ లాంటి యాప్​ల్లో ఏదో ఒకదానిని డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించేవారు. అలా చేస్తే బాధితుల చరవాణి రిమోట్​ను నేరస్థులకు ఇచ్చినట్లే కావడం వల్ల అందులో జరిగే వ్యవహారాలన్నీ వారికి తెలిసిపోయేవి. అలా బాధితుల బ్యాంకు ఖాతా లేదా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆన్​లైన్​లో లావాదేవీలు నిర్వహించేవారు. ఆనంతరం బాధితులకు వచ్చే ఓటీపీ నంబర్లను తెలుసుకొని డబ్బు కొట్టేసేవారు. ఇలా జరిగే ప్రతీ లావాదేవీకి బాధితుల నుంచి ఓటీపీ నంబరు తెలుసుకోవాల్సి వస్తుండటంతో తాజాగా కొత్త ఎత్తుగడలకు తెర తీశారు.

ఎస్ఎంఎస్ టు ఫోన్ యాప్​తో....

కొత్త తరహా మోసంలో భాగంగా నేరస్థులు తొలుత ఎప్పటిలాగే యూపీఐ ఖాతా, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను తెలుసుకుంటున్నారు. ఆనంతరం ఎనీడెస్క్, క్విక్ సపోర్ట్, టీమ్ వ్యూయర్ లాంటి యాప్​లకు బదులుగా ఎస్ఎంఎస్ టు ఫోన్ యాప్​ను బాధితుల చరవాణిలో నిక్షిప్తం చేయించి యూజర్ ఐడీని తెలుసుకుంటున్నారు. ఆ సమయంలో తమకు చెందిన చరవాణి నంబరుకు నమోదు చేయిస్తున్నారు. అలా చేస్తే బాధితుల చరవాణికి వచ్చే సంక్షిప్తం సందేశాలు ఆటోమేటిగ్గా నేరస్థులకూ చేరిపోతాయి. అప్పుడు బ్యాంకు లావాదేవీ నిర్వహించేటప్పుడు వచ్చే ఓటీపీ కోసం బాధితులను ఆడగాల్సిన అవసరం లేకపోవడం వల్ల జామ్ తారా మోసగాళ్లు ఈ కొత్త తరహా మోసాల బాట పడుతున్నారు. ఖాతాలో నుంచి డబ్బు పొగొట్టుకున్నాక గానీ బాధితులు తేరుకోలేకపోతున్నారు.

ఇదీచూడండి.. ప్రపంచానికి బొమ్మల హబ్​గా భారత్​: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.