ETV Bharat / jagte-raho

ముగిసిన కస్టడీ... 49 లక్షల లంచంపై నోరుమెదపని నగేశ్​.. - నర్సాపూర్​ లంచం కేసు నిందితుడు నగేశ్​ తాజా వార్తలు

నర్సాపూర్​ లంచం కేసులో నిందితుడు నగేశ్​ కస్టడీ నేటితో ముగిసింది. నాలుగు రోజులుగా నగేశ్​ను ప్రశ్నించిన అధికారులు... పలు బినామీ ఆస్తులను గుర్తించారు. 49 లక్షల లంచం గురించి నగేశ్​ నోరు విప్పలేదు.

Nagesh's custody ends in Narsapur bribery case
ముగిసిన కస్టడీ... 49 లక్షల లంచంపై నోరుమెదపని నగేశ్​..
author img

By

Published : Sep 24, 2020, 7:27 PM IST

నర్సాపూర్​ లంచం కేసులో ఐదుగురు నిందితుల కస్టడీ ముగిసింది. అదనపు కలెక్టర్​ నగేశ్​తో పాటు మిగతా నలుగురిని వైద్య పరీక్షల నిమిత్తం అనిశా అధికారులు కోఠి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత న్యాయస్థానంలో హాజరుపర్చి... చంచల్​గూడ జైలుకు తరలించనున్నారు.

అవినీతి నిరోధకశాఖ అధికారులు అదనపు కలెక్టర్​ నగేశ్​, ఆర్​డీఓతో అరుణారెడ్డితో పాటు మరో ముగ్గురిని నాలుగు రోజుల పాటు ప్రశ్నించారు. కోటి 12 లక్షల లంచం కేసులో కీలక భూమిక పోషించిన అదనపు కలెక్టర్​ నగేశ్​ బినామీ ఆస్తులను అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు.

నగేశ్​ బినామీగా వ్యవహరించిన ఆరుగురిని కూడా ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా నగేశ్​ ఆస్తులు కూడ బెట్టినట్లు అధికారులు గుర్తించారు. 49 లక్షల లంచం గురించి మాత్రం నగేశ్​ నోరు విప్పలేదు.

ఈ కేసులో మెదక్ మాజీ కలెక్టర్​కు నోటీసులు ఇచ్చే అంశాన్ని అనిశా అధికారులు పరిశీలిస్తున్నారు. నిషేధిత చట్టం కింద ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని అప్పటి కలెక్టర్... రిజిస్ట్రేషన్ల శాఖకు రాసిన లేఖను అనిశా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు లింగమూర్తితోనూ నగేశ్​.. పలుమార్లు కలెక్టర్ పేరు ప్రస్తావించారు. దీంతో ఆయనకు ఈ కేసుతో ఏమైనా సంబంధం ఉందా అని కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ఈ మేరకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.