ETV Bharat / jagte-raho

కొడుకును మందలించబోయి.. హత్యచేశాడు - మహబూబ్​నగర్​ తాజా వార్త

మద్యానికి బానిసైన కొడుకును దారిలో పెట్టే ప్రయత్నంలో తండ్రీ కొడుకుల మధ్య జరిగిన ఘర్షణ లో కుమారుడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో చోటుచేసుకుంది.

murder-in-mahaboobnagar
కొడుకును మందలించబోయి.. హత్యచేశాడు
author img

By

Published : Dec 15, 2019, 4:15 PM IST

Updated : Dec 15, 2019, 8:07 PM IST

కొడుకును మందలించే క్రమంలో క్షణికావేశానికి గురైన తండ్రి.. కొడుకును రోకలిబండతో మోదడం వల్ల అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్​ జిల్లా బయ్యారం మండలం లక్ష్మీ నర్సింహపురం గ్రామంలో జరిగింది. మధుకర్​కు శ్రావణి అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం.. సంసారం సాఫీగా సాగిపోతుంది అనుకునే క్రమంలో అతను మద్యానికి బానిసయ్యాడు.

ఇటీవల కాలంలో ఇంట్లో వస్తువులను విక్రయించి వచ్చిన డబ్బుతో అతను మద్యం సేవిస్తున్నాడు. దీనితో తండ్రి వీరయ్య.. కొడుకు మధుకర్ రోజూ గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం మధుకర్ ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను అమ్మి వచ్చిన డబ్బులతో తాగడాన్ని చూడలేని వీరయ్య.. కొడుకును మందలించటం వల్ల ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. క్షణికావేశానికి గురైన వీరయ్య విచక్షణ మరిచి రోకలి బండతో మధుకర్​ తలపై కొట్టడం వల్ల అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనతో ఒక్కసారిగా కుటుంబం రోదనలో మునిగిపోయింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

కొడుకును మందలించబోయి.. హత్యచేశాడు

ఇదీ చూడండి: స్త్రీలపై నేరాల్లో 60% అత్యాచారాలే!

sample description
Last Updated : Dec 15, 2019, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.