ETV Bharat / jagte-raho

స్నేహితులే హత్య చేశారు.. మూడు రోజుల్లో హత్యకేసు ఛేదన! - తెలంగాణ వార్తలు

మద్యం తాగుతూ స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ డేటా ఆధారంగా మూడు రోజుల్లో ఛేదించారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు దుండిగల్ పోలీసులు వెల్లడించారు.

murder-case-investigation-in-three-days-by-dundigal-police-in-medchal-malkajgiri-district
స్నేహితులే హత్య చేశారు.. మూడు రోజుల్లో హత్యకేసు ఛేదన!
author img

By

Published : Jan 27, 2021, 2:32 PM IST

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో జరిగిన హత్య కేసును దుండిగల్ పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించారు. ఈ నెల‌ 24న గండిమైసమ్మ చౌరస్తాలోని బార్‌లో శివ గౌడ్ స్నేహితులతో మద్యం సేవించి... అనంతరం శివ గౌడ్ రూంలో పేకాట ఆడుతుండగా డబ్బుల విషయంలో గొడవ జరిగింది. ఈ ఘర్షణలో శివగౌడ్ స్నేహితులు దిలీప్ సింగ్, దేవేందర్, బంటి ముగ్గురు కలిసి అతడిని హత్య చేసి పరారయ్యారని పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు కాల్ డేటా ఆధారంగా ఛేదించినట్లు తెలిపారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. వారి నుంచి ఒక‌ ద్విచక్రవాహనం, రెండు సెల్‌ఫోన్లు, రూ.13,800/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: ఏపీలో చోరీ సొత్తులో.. రాబట్టింది సగమే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.