ఖమ్మం జిల్లా వైరాలో భాజాపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఆర్టీఐ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నేలవెళ్లి రామారావుపై పట్టణానికి చెందిన ఓ యువకుడు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉదయం ఆరు గంటల సమయంలో పాత బస్టాండ్ ప్రాంతంలోని రామారావు ఇంటికి వెళ్లి యువకుడు కత్తితో దాడి చేసినట్టు స్థానికులు చెబుతున్నారు.
రక్తపుమడుగులో అపస్మారక స్థితికి చేరుకున్న రామారావుని 108 అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిగా... చికిత్స పొందతూ.. మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని వైరా ఏసీపీ సత్యనారాయణ, సీఐ వసంత్ కుమార్, ఎస్సై తిరుపతి రెడ్డి పరిశీలించి, దాడి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఇదీ చూడండి: ఆదిలాబాద్ కాల్పుల ఘటనలో వ్యక్తి మృతి