రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద చోటుచేసుకుంది. శ్రీరాంపూర్‌కు చెందిన సత్తక్కతో పాటు ఆమె కొడుకు నవీన్ ఓ కార్యక్రమానికి వెళ్లి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: బోరు బావిలో పడ్డ నాలుగేళ్ల బాలుడు