ETV Bharat / jagte-raho

విషాదం... తల్లి, కూతురు ఆత్మహత్యాయత్నం - Rangareddy District Mogaligidda Latest News

ఓ కుటుంబంలో భార్య, భర్త, కూమార్తెల మధ్య గొడవలయ్యాయి. అవి కాస్తా ఆత్మహత్యాయత్నం వరకు దారి తీశాయి. గొడవలో భాగంగా ఆవేశం ఆపుకోలేని తల్లి, కూతురు ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొగలిగిద్దలో చోటుచేసుకుంది.

Mother, daughter suicide attempt at mogiligidda rangareddy district
ఒకే కుటుంబంలో తల్లి, కూతురు ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Aug 15, 2020, 9:26 PM IST

కుటుంబ కలహాలతో ఒంటికి నిప్పంటించుకుని తల్లి, కూతురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొగలిగిద్దలో శనివారం సాయంత్రం జరిగింది. ప్రైవేట్ బస్​కు డ్రైవర్​గా పని చేసే పాండు భార్య చంద్రకళ(40), కూతురు స్రవంతి(17)కుటుంబంలో శనివారం సాయంత్రం గొడవలు జరిగాయి. అవికాస్తా ఎక్కువై తల్లి, కూతురు ఇద్దరూ శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు.

అక్కడే ఉన్న పాండు మంటలు ఆర్పి వారిని షాద్​నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. తల్లి 90, కూతురు 70 శాతం మేర కాలినట్లు వైద్యులు తెలుపగా.. అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆత్మాహత్యాయత్నానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి : "నువ్వు నేను ఒకటట.. మన కీర్తి ఘనమట"

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.