జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి సమీపంలో ఎన్హెచ్ 44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓమ్నీ వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ప్రమాద సమయంలో 12 నెలల బాబు అక్కడికక్కడే మరణించగా.. తల్లి ప్రత్యూష చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు.
హైదరాబాద్ నుంచి సొంత ఊరు ఆళ్లగడ్డకు కుటుంబంతో కలిసి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వివరించారు. వీరందరూ కర్నూలు జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. కుమారుడు, భార్య మరణించగా... రామచంద్రుడు, అతని కుమార్తె కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండిః సైబరాబాద్ వద్ద వరదనీటిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం