వరంగల్‌లో తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న వినోద్‌కుమార్ అనే వ్యక్తిని.. పోలీసులు అరెస్టు చేశారు. పాత సామాన్లు, కాగితాలు ఏరివేసే నెపంతో వీధి వీధి తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి.. దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
గతంలో హైదరాబాద్‌తోపాటు నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్‌లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇంతకముందు జైలు జీవితం గడిపిన వినోద్.. బయటకి వచ్చాక వరంగల్‌లో దొంగతనాలకు పాల్పడ్డాడు. వరంగల్, నర్శంపేట, పరకాల, జనగామ, పాలకుర్తి పరిధిలో.. మొత్తం 11 చోరీలకు పాల్పడి చివరికి పోలీసులకు చిక్కాడు.
భగత్‌సింగ్‌నగర్ శ్మశానంలో బంగారం, వెండి, నగదు దాచినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి రూ.40 లక్షల విలువైన 641 గ్రాముల బంగారం, కిలో 90 గ్రాముల వెండితోపాటు... రూ.2.88లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి: మహిళను టార్గెట్ చేశాడు.. తానే టార్గెట్‌గా మారాడు..