హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాపూనగర్‌లో శుక్రవారం అర్థరాత్రి మద్యం మత్తులో అల్లరిమూకలు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఓ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఆ ఇంట్లోని భార్యాభర్తలపై కూడా దాడి చేయడానికి యత్నించారు. వారిని అడ్డుకోవడానికి వచ్చిన పలువురిపైనా దాడి చేశారు.
ఈ దృశ్యాలన్నీ అక్కడే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. దాడులకు పాల్పడిన వారిలో అధికార పార్టీకి చెందిన బాపూనగర్ మాజీ అధ్యక్షుడు రాకేష్ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా పలువురిని అరెస్టు చేసి దాడికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: జనాల మధ్యే కాదు.. ఎవరూలేని చోటా కరోనా!