ETV Bharat / jagte-raho

ఆయిల్​ ట్యాంకర్​, బస్సు ఢీ.. ప్రయాణికులు సేఫ్​

author img

By

Published : Nov 4, 2020, 11:05 PM IST

పెద్దపల్లి జిల్లా ఎక్లాస్పూర్ గ్రామ సమీపంలో వద్ద పెను ప్రమాదం తప్పింది. ఆయిల్​ ట్యాంకర్​ను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు అద్దాలు, ముందుభాగం స్వల్పంగా ధ్వంసమైంది.

Missed road accident in Eklaspur, Peddapalli District
ఆయిల్​ ట్యాంకర్​, బస్సు ఢీ.. ప్రయాణికులు సేఫ్​

పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామ సమీపంలోని గాడిదల గండి వద్ద పెను ప్రమాదం తప్పింది. మంథని పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో గాడిదల గండి గుట్టపైన వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఒక్కసారిగా బ్రేకులు వేయగా.. గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆయిల్​ ట్యాంకర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు, ముందు భాగం ధ్వంసమైంది. ట్యాంకర్​ వెనుక భాగం కూడా కొద్దిగా దెబ్బతిన్నది.

బస్సులో కొంతమంది ప్రయాణికులకు చిన్నచిన్న స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ గాడిదల గండి గుట్ట వద్ద రోడ్డు ఏటవాలుగా ఉండడంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత సంవత్సరం ఇదే స్థలంలో మూడు ప్రమాదాలు జరిగాయి. అధికారులు ఇప్పటికైనా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రహదారి విస్తరణ చేపట్టాలని కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.