హైదరాబాద్ గాంధీనగర్ పరిధిలో దారుణం జరిగింది. నమ్మి వెంట వచ్చిన ఓ మైనర్ బాలికను వివస్త్రను చేసి, బ్లేడుతో విచక్షణారహింతగా దాడిచేశారు ముగ్గురు మైనర్ బాలురు. ఈ ఉదంతాన్నంతా చరవాణిలో చిత్రీకరించి తమ కృూరత్వాన్ని ప్రదర్శించారు.
నమ్మింది...మోసపోయింది...
మైసమ్మ గూడాకు చెందిన ఓ బాలిక అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలురుతో స్నేహంగా ఉండేది. వారు ఆ అమ్మాయికి గంజాయి అలవాటు చేశారు. శుక్రవారం రాత్రి వారితో పాటు లోయర్ ట్యాంక్ బండ్ డీబీఆర్ మిల్స్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళి గంజాయి సేవించారు. ఆ తర్వాత ఆమెను వివస్త్రను చేసి ఒంటిపై బ్లేడుతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఈ దారుణాన్ని చరవాణిలో రికార్డ్ చేశారు. కాళ్ళా వేళ్ళా పడి బతిమిలాడినా వదల్లేదు. ఎలాగోలా వారినుంచి తప్పించుకుని బయటపడిన ఆ బాలికను స్థానికులు గమినించి ఆసుపత్రిలో చేర్పించారు. బాలురకు దేహశుద్ధి చేసి గాంధీనగర్ పోలీసులుకు అప్పగించారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి:తల్లి తిట్టిందని యువకుడు ఆత్మహత్య