ETV Bharat / jagte-raho

ఏవోబీలో ఎదురుకాల్పులు... మావోయిస్టు మృతి

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని జంత్రి పంచాయతీ పరిధిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య శనివారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. గాయపడిన మావోయిస్టుని మల్కాన్​గిరి ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఒక ఏకే 47 రైఫిల్, మూడు ఏకే 47 మేగజైన్, ఐఈడీ, డిటోనేటర్లు లభ్యమయ్యాయని కొరాపుట్ డీఐజీ సఫీం అహమ్మద్ తెలిపారు. ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఏపీ, ఒడిశా పోలీసులు గాలిస్తున్నారు.

moist
moist
author img

By

Published : Nov 29, 2020, 7:39 AM IST

మావోయిస్టు దళాన్ని వదిలి ప్రభుత్వానికి సహకరిస్తే అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని ఏపీ కొరాపుట్‌ డీఐజీ సఫీం అహమ్మద్‌ సూచించారు. మల్కాన్‌గిరి జిల్లా చిత్రకొండ మండలం జంత్రి పంచాయతీలో పోలీసులు, మావోయిస్టుల మధ్య గురువారం జరిగిన కాల్పుల ఘటనపై ఆయ‌న మాట్లాడారు.

ఆంధ్రా - ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారని ఆయన తెలిపారు. గురాసేతులో కొత్త బీఎస్‌ఎఫ్‌ క్యాంపు ప్రారంభించిన తర్వాత మొదటిసారి జంత్రి పంచాయతీలో ఒడిశా తరఫున ఎస్‌వోజీ, డీబీఎఫ్‌, ఆంధ్రప్రదేశ్‌ తరఫున బీఎస్‌ఎఫ్‌, గ్రేహండ్‌ జవాన్లు కూంబింగ్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టారన్నారు. ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో శనివారం కూంబింగ్‌ నిర్వహించామని చెప్పారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారన్నారు. జవాన్లు కూడా కాల్పులు జరపడంతో మావోయిస్టులు అక్కడ నుంచి పరారయ్యారన్నారు.

moist
మావోయిస్టులు ఉపయోగించిన ఆయుధాలు, పరికరాలు

పోలీసులు ఆ ప్రాంతంలో గాలించగా మావోయిస్టు కిశోర్‌ అలియాస్‌ మాసా కవాసి మృతదేహం లభించిందన్నారు. ఘటనా స్థలంలో గాయాలతో పడి ఉన్న మరో మావోయిస్టుకు జవాన్లు ప్రాథమిక చికిత్స చేసి మల్కాన్‌గిరి ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు. గాయపడిన మావోయిస్టు మల్కాన్‌గిరి జిల్లా బోడాంబో గ్రామానికి చెందిన లయిఖన్‌ అలియాస్‌ లక్ష్మణ్‌ గలరి అని తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47 రైఫిల్‌, మూడు ఏకే 47 మేగజైన్‌, 40 రౌండ్లు 7.62 ఎమ్‌.ఎమ్‌ బుల్లెట్లు, ఒక ఇన్సాస్‌ రైఫిల్‌, ఒక ఐఈడీ, 11 డిటోనేటర్లు, రెండు మోటోరోలా కమ్యూనికేషన్‌ సెట్లు, ఒక వాకీటాకీ ఛార్జర్‌, ఒక కెమెరా, రెండు రిమోట్లు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారని డీఐజీ సఫీరం అహమ్మద్ తెలిపారు.

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పులలో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు పెద్దఎత్తున గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారన్నారు. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు నేతలు తప్పించుకున్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకు ఆంధ్రా గ్రేహౌండ్స్‌, ఎస్‌వోజీ బలగాలను అదనంగా మోహరించాయన్నారు.

ఇదీ చదవండి : గల్లీకి పనికిరాని సీఎం కేసీఆర్ దిల్లీకి పనికొస్తాడా: బండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.