ఏపీోలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లు సమీపంలోని నాగార్జున సాగర్ కెనాల్ వద్ద... మావోయిస్టు కంభంపాటి చైతన్య అలియాస్ సూర్యను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.10 వేలు, మలయాళీ భాషలో ఉన్న విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
చైతన్య అలియాస్ సూర్య స్వగ్రామం గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడు. పీడీఎం, పీకేఎస్, ఏపీసీల్సీ, పీకేఎం వంటి సంస్థల్లో చైతన్య క్రయాశీల పాత్ర పోషిస్తూ... కబని-1 దళంలో ఏరియా కమిటీ సభ్యునిగా వ్యవహరించారు. గతంలో రాయలసీమ, పశ్చిమ కనుమల్లో మావో కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న చైతన్య మావోయిజం భావజాలాన్ని యువతకు నూరిపోసి రిక్రూటింగ్ చేసేందుకు తన వంతు పాత్ర పోషించాడని... గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.
ఇదీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం... అక్కడికక్కడే ఇద్దరు యువకులు మృతి