ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా యడ్లపాడులో ఓ వ్యక్తి తనకు సంబంధం ఉన్న వివాహితతో సన్నిహతంగా ఉంటున్నాడని.. మిత్రుడికి పురుగుల మందు ఇచ్చి హత్య చేయడానికి ప్రయత్నించాడు. దాట్ల గోపి వర్మ, అదే మండలం మర్రిపాలెంకు చెందిన కొమ్మూరి ప్రేమ్ చంద్‌లు మంచి స్నేహితులు. ప్రేమ్ చంద్‌కు కాకుమాను మండలం గరికపాడు గ్రామానికి చెందిన దూరపు బంధువైన ఓ వివాహితతో సన్నిహిత సంబంధం ఉంది. ఇటీవల ప్రేమ్ చంద్‌కు కాకుమాను మండలం గరికపూడి గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రేమ్‌చంద్ సన్నిహితంగా ఉన్న వివాహితతో గోపివర్మ పరిచయం పెంచుకొని తరచుగా ఫోన్లో మాట్లాడుతుండేవాడు. ఇది గుర్తించిన ప్రేమ్ చంద్.. మిత్రుడు గోపీచంద్‌పై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది.
ఈ నెల 2వ తేదీన యడ్లపాడు వచ్చిన ప్రేమ్ చంద్ స్నేహితుడు గోపి వర్మను కలిశాడు. మరొకసారి ఇద్దరి మధ్య అదే విషయంలో గొడవ జరిగింది. గోపివర్మను కడతేర్చాలని ప్రేమ్‌చంద్ నిర్ణయించుకున్నాడు. అదేరోజు రాత్రి గోపివర్మను కలిసి పురుగుల మందు కలిపిన శీతల పానీయాన్ని అతనితో తాగించాడు. అనంతరం ఇద్దరూ వెళ్లిపోయారు. అనంతరం గోపివర్మ పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం గోపివర్మ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. యడ్లపాడు ఎస్సై శ్రీహరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'నా భర్త నన్ను మోసం చేశాడు.. న్యాయం చేయండి'