సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం చోటకూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామానికి చెందిన బేగరి అశోక్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. అతని కొడుకు శశాంక్‌తో కలిసి మర్వెల్లి నుంచి ఆటోలో హైదరాబాదులోని కేపీహెచ్‌బీకి బయలుదేరాడు.
చోటకూర్ గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా అతివేగంతో వస్తున్న లారీ వీరు వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో శశాంక్‌కు తీవ్రగాయాలు కాగా.. అశోక్‌ను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని భార్య జయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగలక్ష్మి తెలిపారు.
ఇవీ చూడండి: 'పందులే గుంపులుగా వస్తాయి... సింహం సింగిల్‌గా వస్తుంది'