మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం బండర్పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బండర్పల్లికి చెందిన రామచంద్రం అక్కడికక్కడే దుర్మరణం చెందగా... మరో నలుగురికి గాయాలయ్యాయి.
దేవరకద్ర నుంచి మరికల్ వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన మరో ఆటో ఢీ కొట్టింది. గాయాలపాలైన సత్యమ్మ, చంద్రకళ, నరసమ్మతో పాటు మూడేళ్ల బాలుడిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నచింతకుంట పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.