మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పరాజుపల్లి క్రాస్ రోడ్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు టైరు పంచరై అదుపు తప్పి చెట్టుకు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని చిన్నబజార్లో గల పద్మావతీ జ్యూవెలరీ షాప్‌లో గుమస్తాగా పని చేస్తున్న అర్జున్ అనే యువకుడు... ప్రణయ్ కుమార్, శివశంకర్‌తో కలిసి కారులో వరంగల్‌కు బయలుదేరారు.
మార్గం మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన బాటసారులు 108కి సమాచారం అందించి, క్షతగాత్రులను మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రణయ్ కుమార్ పరిస్థితి విషమంగా ఉండగా... శివశంకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గూడూరు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: ప్రేయసి పెళ్లికి ఒప్పుకోలేదని యువకుడి ఆత్మహత్య