ETV Bharat / jagte-raho

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి.. విషాదంలో కుటుంబీకులు - విద్యుదాఘాతం కామారెడ్డి వార్తలు

కామారెడ్డి జిల్లా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్​ గ్రామంలో గొల్ల ముత్యం అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మరణించాడు. ఇంట్లో కరెంట్​ రావాట్లేదంటూ విద్యుత్​ వైరును పట్టుకోగా షాక్​ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.

man died due to current shock at kamareddy district
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి.. విషాదంలో కుటుంబీకులు
author img

By

Published : Oct 14, 2020, 5:03 PM IST

నివాసంలో విద్యుత్​ లేదని.. కరెంట్​ బుడ్డి వైరును పట్టుకోగా విద్యుదాఘాతమై వ్యక్తి మరణించిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అడ్లూర్​ గ్రామంలో జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్​ అందజేసిన గొర్రెలు, మేకలు కాపలా కాస్తూ ముత్యం జీవనోపాధి పొందుతున్నాడు.

ముత్యంకు ముగ్గురు కూతుర్లుండగా.. ఇద్దరు కూతుళ్లకు ఇంకా వివాహం కాలేదు. ఇంటికి పెద్ద దిక్కైన ముత్యం మరణంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండిః ఎస్సార్​ నగర్​లో కరెంట్​ షాక్​ తగిలి.. బార్​ క్యాషియర్​ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.