వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఓ భవన నిర్మాణ కార్మికుడు విద్యుదాఘాతంతో మరణించాడు. సమ్మయ్యనగర్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనం వద్ద పనిచేస్తున్న కార్మికులు అశోక్.. ప్రమాదవశాత్తు 33 కేవీ విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అశోక్ స్వగ్రామం మోతురాజపల్లి కాగా పొట్టకూటి కోసం స్థాని వికాస్నగర్లో నివసిస్తున్నారు.