ETV Bharat / jagte-raho

భార్య వేధిస్తోందని గాజు ముక్కతో గొంతుకోసుకున్న భర్త - Anantapur District Kadiri Crime News

భార్యతో గొడవపడి గాజు సీసా ముక్కతో గొంతుకోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు వైద్యశాలకు తరలించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

wife harassments
భార్య వేధిస్తోందని గాజు ముక్కతో గొంతుకోసుకున్న భర్త
author img

By

Published : Dec 1, 2020, 11:33 PM IST

అనంతపురం జిల్లా కదిరిలో భార్యతో గొడవపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని స్థానికులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఏం జరిగిందంటే?

కడప జిల్లా రాయచోటి మండలం కె.రామాపురానికి చెందిన శివశింకర్.. సెలూన్​లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్యతో గొడవపడి.. అనంతపురం బస్సు ఎక్కి కదిరి వెళ్లిపోయాడు. మనస్తాపంతో గాజు సీసా ముక్కతో వలీసాబ్​ రోడ్డులో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు.

రక్తపుమడుగులో ఉన్న శివశంకర్​ను చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. బాధితుడిని కదిరి ప్రభుత్వాసుపత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. భార్య వేధించటంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు బాధితుడు తెలిపాడని పోలీసులు చెప్పారు.

ఇవీచూడండి: భార్య మరణంతో మనోవేదనకు గురై ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.