ETV Bharat / jagte-raho

గజ్వేల్​ ఆర్డీఓ కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం - Gajwel RDO office news

గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కొండపోచమ్మ జలాశయం ముంపులో తనకు రావాల్సిన పరిహారం అందలేదని ఈ ఘటనకు యత్నించాడు.

గజ్వేల్​ ఆర్డీఓ కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Sep 24, 2020, 4:49 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేకెత్తించింది. కొండపోచమ్మ జలాశయం ముంపు బాధితుడు తనకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా రెండేళ్లుగా తిప్పుతున్నారని ఆర్డీవో కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అతడిని అడ్డుకున్నారు. అనంతరం గజ్వేల్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ములుగు మండలం మామిడాలకు చెందిన సబ్బని జానకిరాములుకు సంబంధించిన వ్యవసాయం నివాస గృహం కొండపోచమ్మ జలాశయంలో ముంపునకు గురైంది. వ్యవసాయ భూమికి సంబంధించిన పరిహారం అందించిన అధికారులు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని వాపోయాడు. రెండేళ్లుగా ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

గజ్వేల్​ ఆర్డీఓ కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఇదీ చూడండి: చర్ల ఎదురు కాల్పులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.