ETV Bharat / jagte-raho

ఫేస్​బుక్​లో అమ్మాయిలను వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్ - అమ్మాయిలను వేధిస్తోన్న పోకిరి అరెస్టు

అందమైన అమ్మాయి ఫొటో డౌన్ లోడ్ చేసుకుని సదరు అమ్మాయి స్నేహితులతో ఫేస్ బుక్​లో అసభ్యకరంగా చాటింగ్ చేసిన ఓ పోకిరిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు

ఫేస్ బుక్ లో అమ్మాయిలను వేధిస్తోన్న వ్యక్తి అరెస్ట్
ఫేస్​బుక్​లో అమ్మాయిలను వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్
author img

By

Published : Oct 6, 2020, 9:53 PM IST

ఫేస్​బుక్​లో అమ్మాయిలను వేధిస్తోన్న వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ గ్రామానికి చెందిన పి.కిరణ్ కుమార్... ఫేస్ బుక్​లో అందమైన అమ్మాయిల ఫొటోలు డౌన్ లోడ్ చేసుకొని.. వాటి ద్వారా నకిలీ అకౌంట్ క్రియేట్ చేశాడు. సదరు అమ్మాయిల స్నేహితులతో అసభ్యకరంగా చాటింగ్ చేశాడు.

ఓ బాధిత యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఐపీ అడ్రస్ ఆధారంగా కిరణ్ కుమార్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. నిందితుడు ఇప్పటికే 10 మంది అమ్మాయిలను వేధించినట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటికే సూర్యాపేట, కోదాడ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదైనట్లు తెలిపారు.

ఇదీ చూడండి: ఆ రెండు ప్రాజెక్టుల నిర్వహణ మాకే ఇవ్వాలి: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.