విజయవాడ గ్యాంగ్‌వార్ కేసులో ప్రధాన నిందితుడు పండు అలియాస్ మణికంఠ అరెస్ట్ అయ్యాడు. హత్యకు వినియోగించిన కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే ఈ కేసు విషయంలో 33 మందిని అరెస్ట్ చేసినట్లు పటమట పోలీసులు తెలిపారు.
పరారీలో ఉన్న మరో 15 మంది కోసం గాలిస్తున్నట్ల తెలిపారు. వీరి కోసం 6 ప్రత్యేక బృందాలు వెతుకుతున్నట్లు చెప్పారు. ఘర్షణ పడ్డ వారిపై రౌడీ షీట్లు తెరవనున్నట్లు పేర్కొన్నారు. నేర చరిత్ర ఎక్కువగా ఉన్నవారికి నగర బహిష్కరణ విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు పటమట పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: విజయవాడ గ్యాంగ్ వార్: వెలుగులోకి కీలక అంశాలు