కామారెడ్డి జిల్లా బాన్సువాడ మొగలాన్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. పెద్ద కొడ్పగల్ మండలం టీకరం తండాకు చెందిన జయరాం(22), లింగాం పేట మండలం బావనిపేట్ తండాకు చెందిన సోనీ(18) ఇద్దరూ ప్రేమించుకున్నారు.
వీరిరువురూ నిర్మానుష్య ప్రాంతంలో విగతజీవులుగా పడి ఉండడం గమనించిన చుట్టుపక్కల ప్రాంతం వాళ్లు పోలీసులుకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న డీఎస్పీ దామోదర్ రెడ్డి, సీఐ మహేశ్‌గౌడ్ కేసు నమోదు చేసుకున్నారు. మరణించడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం... రోడ్డుపై పడ్డ 20 కుటుంబాలు