వరంగల్ ఖిలావరంగల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. పెద్దలు పెళ్లికి నిరాకరించారని నక్కలపల్లిలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. సాయి, శివాని ఇద్దరు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. పెద్దల్ని ఎదురించి కలిసి బతకలేక.. ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడ్డారు.
ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంపై నక్కలపల్లి శివారులోని బావి వద్దకు చేరుకున్నారు. చుట్టుపక్కల ఎవరు లేరని నిర్ధారించుకుని... బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. డీఆర్ఎఫ్ బృందం, గజఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. అనంతరం ఫోన్ ఆధారంగా మృతుల కుటుంబీకులకు సమాచారం అందించారు.
ఇదీ చూడండి: కులాలు వేరని పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు.. ప్రేమజంట ఆత్మహత్య