సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ లారీ.. అదుపుతప్పి స్థానిక మోడల్ స్కూల్ వద్ద గల బస్ షెల్టర్‌ను ఢీకొట్టింది. ఫలితంగా షెల్టర్ మొత్తం కుప్పకూలిపోయింది. అదృష్టవశాత్తు బస్ షెల్టర్‌లో ప్రయాణికులెవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
ఘటనలో లారీ డ్రైవర్ సైతం సురక్షితంగా బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి.. పోలీసులకు చిక్కినా.. నామమాత్రపు విచారణతో దర్జాగా దందా