ETV Bharat / jagte-raho

మాట్రిమోనీ సైట్లో నకిలీ ఖాతాతో సొమ్ము కాజేసిన కిలేడి - తెలుగు మాట్రిమోనీ కిలాడి అరెస్ట్​

పెళ్లి సంబంధాల కోసం వెతుక్కునే తెలుగు మ్యాట్రిమోని సైట్​లో ఓ కిలేడీ ఘరానా మోసానికి పాల్పడింది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి.. మారు పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి ఎల్బీనగర్​కు చెందిన ఓ యువకుడి నుంచి డబ్బులు వసూలు చేసింది.

మాట్రిమోనీ సైట్లో నకిలీ ఖాతాతో సొమ్ము కాజేసిన కిలేడి

author img

By

Published : Dec 27, 2020, 4:19 AM IST

తెలుగు మాట్రిమోని సైట్లో నకిలీ ఖాతా రూపొందించి మోసానికి పాల్పడిన ఓ కిలేడిని ఎల్బీనగర్​ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బండి లావణ్య హైదరాబాద్​లోని నారాయణ పాఠశాలలో టీచర్​గా పనిచేస్తోంది... శాన్వి కృతిక పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి ఓ యువకుడి నుంచి డబ్బులు వసూలు చేసింది.

బంధువులకు కరోనా వచ్చిందని నమ్మిస్తూ సొమ్ము తీసుకుంది. కిలేడీ మాయమాటలు నమ్మి డబ్బులిచ్చి మోసపోయిన ఓ యువకుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఎల్బీనగర్​ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: ఇప్పుడే వస్తానని చెప్పి అదృశ్యమైంది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.