ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం చెన్నాపురంలో ఓ యువతి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరకరించడం వల్ల ఆత్మహత్య చేసుకుంది.
చెన్నాపురం గ్రామానికి చెందిన యువతి పలాసలోని అన్నపూర్ణ వీధికి చెందిన పొందర ప్రశాంత్ బెహరాతో రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 29న తనని పెళ్లి చేసుకోవాలంటూ ప్రశాంత్ బెహరాను కోరింది. అతను తిరస్కరించడంతో మనస్తాపం చెందింది. ఇంట్లో పురుగుల మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆమె మృతి చెందినట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.
ఇదీ చదవండి: యువకునిపై కత్తితో దాడి... చికిత్స పొందుతూ మృతి