ETV Bharat / jagte-raho

గొర్రెకుంట మృత్యుబావి కేసుపై కాసేపట్లో తీర్పు - Judgment on Gorrekunta death well case

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట మృత్యుబావి కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసులో తొమ్మిది మంది జలసమాధి అయ్యారు.

geesukonda case
గొర్రెకుంట మృత్యుబావి కేసులో నేడే తీర్పు..
author img

By

Published : Oct 28, 2020, 10:12 AM IST

Updated : Oct 28, 2020, 10:47 AM IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంట మృత్యుబావి కేసులో ఇవాళ తీర్పు వెలువడనుంది. బిహార్​కు చెందిన నిందితుడు సంజయ్​కుమార్.. మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చి తొమ్మిది మందిని జలసమాధి చేశాడు. ఈ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయింది. మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఇవాళ తీర్పివ్వనున్నారు.

వరంగల్‌ గ్రామీణ జిల్లా గొర్రెకుంట శివారులోని పాడుబడ్డ బావిలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మే 20న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బంగా నుంచి 20 ఏళ్ల క్రితమే వచ్చి వరంగల్​లో స్థిరపడిన మక్​సూద్​ కుటుంబ సభ్యులు దారుణహత్యకు గురయ్యారు. మక్​సూద్ ఇంటిపక్కనే నివాసముండే ఇద్దరు బిహారి యువకులు కూడా విగత జీవులుగా బావిలో తేలారు. తొలుత ఆత్మహత్యలుగా భావించిన పోలీసులు.. అనంతరం వాటిని హత్యలుగా నిర్ధరించారు.

టాస్క్​ఫోర్స్, సీసీఎస్, క్లూస్​టీం, సాంకేతిక బృందం.. ఇలా 6 బృందాలతో రాత్రింబవళ్లు దర్యాప్తు చేసి 72 గంటల్లోనే కేసు మిస్టరీని ఛేదించారు. బిహార్​కు చెందిన సంజయ్​కుమార్ యాదవ్​ హత్యలు చేసినట్లు నిర్ధరించిన పోలీసులు.. అనంతరం అరెస్ట్​ చేశారు. ఒక హత్యను కప్పిపుచ్చుకోవడానికి.. 9 మందిని హతమార్చినట్లు పోలీసులు విచారణలో తేలింది.

మొదటి హత్య ఎక్కడ..

మక్​సూద్ భార్య నిషా.. అక్క కూతురు రఫీకాతో సంజయ్ కుమార్ పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏపీలోని నిడదవోలు వద్ద చున్నీతో గొంతు బిగించి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని రైల్లోంచి బయటకు విసిరేశాడు. రఫీకా ఆచూకీ కోసం నిషా ప్రశ్నించడం.. పోలీసులకు చెబుతానని బెదిరించడం వల్ల వారి అడ్డు తొలగించుకోవాలని సంజయ్​ నిర్ణయించుకున్నట్లు పోలీసులు తేల్చారు. అనంతరం భోజనంలో మత్తు మందు కలిపి అపస్మారక స్థితిలోకి వెళ్లగానే బావిలో పడేసి సామూహిక జలసమాధి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 10 మందిని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో పదిరోజుల్లోనే పోలీసులు ఛార్జిషీట్​ దాఖలు చేశారు. మొత్తం 67 మంది సాక్షులను విచారించారు జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి. అనంతరం వాంగ్మూలాలను నమోదుచేశారు.

ఇవీచూడండి: కిరాతకుడు: ఒక హత్యను కప్పిపుచ్చేందుకు మరో 9 హత్యలు

Last Updated : Oct 28, 2020, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.