ETV Bharat / jagte-raho

ఉద్యోగాల పేరుతో మోసం... రూ. 50 లక్షలు మాయం

నిరుద్యోగుల ఆశలే ఈ మోసగాడికి పెట్టుబడిగా మారాయి. నకిలీ సంస్థతో వారిని నమ్మించాడు. మాటలతో బురిడీ కొట్టించాడు. సంస్థలో భాగస్వామ్యం అయితే లాభాలొస్తాయని చెప్పి దాదాపు రూ. 50 లక్షల వరకూ కాజేశాడు. ఇప్పటికే ఒకసారి నేవీ ఉద్యోగాల పేరిట యువతను మోసగించి పోలీసులకు చిక్కి జైలుకెళ్లొచ్చాడు. అయినా తీరు మార్చుకోక మరింత మందిని వంచించాడు. ఎట్టకేలకు మళ్లీ పోలీసులకు చిక్కిన అతని నేర చరిత్రను.. విశాఖపట్నం నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌ సోమవారం వెల్లడించారు.

job-racket-busted-in-visakhapatnam in ap
ఉద్యోగాల పేరుతో మోసం... రూ. 50 లక్షల మాయం
author img

By

Published : Nov 24, 2020, 11:16 AM IST

ఏపీలోని విశాఖలో ఉద్యోగాల పేరుతో 150 మందికిపైగా నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన పాత నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి చెందిన కిలపర్తి సందర్శ్‌(33) విశాఖ నగరంలోని డైమండ్‌ పార్కు సమీపంలోని ఒక భవనంలో ‘సాన్‌ నెక్స్‌ జనరేషన్‌ ఎలక్ట్రానిక్‌ టెక్నాలజీ (ఎస్‌ఎన్‌జీఈటీ) పేరిట ఒక నకిలీ సంస్థను లాక్‌డౌన్‌కు ముందు స్థాపించాడు. ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సెన్సార్‌ ట్యాప్స్‌, శానిటైజేషన్‌ యంత్రాలు, సీసీ కెమెరాలు తయారు చేస్తున్నట్లు నమ్మించాడు. సంస్థకు తాను సీఈవోగా పేర్కొంటూ ఆన్‌లైన్‌లో ప్రాంగణ నియామకాల పేరిట యువతకు వల వేశాడు. బెంగళూర్‌లో శిక్షణ ఉంటుందని, రూ. 10 వేలు ఖర్చవుతుందని చెప్పాడు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తుని, హైదరాబాద్‌ ప్రాంతాలకు చెందిన 175 మంది నుంచి నగదు వసూలు చేశాడు.

ఒక్కొక్కరి నుంచి.. లక్షన్నర వసూలు

కొందరిని పరికరాల తయారీ వైపు, మరికొందరిని మార్కెటింగ్‌ వైపు నియమించాడు. అయితే కొద్ది సరకు మాత్రమే అందుబాటులో ఉంచి దాంతోనే లావాదేవీలు నిర్వహించమనేవాడు. తాము వాటిని విక్రయించలేకపోతున్నామని 30 మంది పేర్కొనగా...ఒక్కొక్కరు రూ.1.50 లక్షల చొప్పున పెట్టుబడి పెడితే సంస్థలో భాగస్వామ్యం కావొచ్చని చెప్పి వారి నుంచి ఆ సొమ్ము కాజేశాడు. పని చేస్తున్న వారికి ఇప్పటికీ వేతనాలు ఇవ్వకపోవడంతో పలువురిలో అనుమానాలు తలెత్తాయి. రూ.1.50 లక్షల చొప్పున ఇచ్చిన వారు కార్యాలయానికి వచ్చి తమ నగదు తిరిగి ఇచ్చేయాలని గట్టిగా డిమాండ్‌ చేయడంతో కొన్ని రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడు.

ఇంటి యజమానిని సైతం..

శివాజీపాలెంలో తాను ఉంటున్న ఇంటి యజమానినీ సందర్శ్‌ బురిడీ కొట్టించాడు. నేవీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి భారీగానే వసూలు చేశాడు. మోసం గుర్తించిన యజమాని ఎంవీపీ కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆరా తీశారు. నిందితునిపై ఇప్పటికే ఎంవీపీ కాలనీ స్టేషన్లో రెండు, టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఒక కేసు నమోదైనట్లు గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం అతడ్ని అదుపులోకి తీసుకొన్నారు. బాధితులు పలువురు నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. తమకు కేసు వద్దని, న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదం: ఒకరు దుర్మరణం, మరో ఇద్దరికి తీవ్రగాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.