ఇవీ చూడండి:రాకేశ్‌రెడ్డితో పరిచయమా? ఎంతకాలంగా
185 మంది@ కోటీ 48 లక్షలు
కొందరు నిరుద్యోగాన్ని ఆసరా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ చైతన్యపురి పరిధిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దగా చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 185 మందిని మోసగించి కోటీ 48 లక్షలు దోచుకున్నట్లు ఎల్బీ నగర్ ఏసీపీ వెల్లడించారు.
నిందితులు
హైదరాబాద్ చైతన్యపురి పరిధిలో ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ పథకం ద్వారా ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసగించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 185 మంది నిరుద్యోగుల నుంచి కోటీ 48 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో నిందితులు బూదరాజు రాధాకృష్ణ, కవిత రెడ్డి, జాన్సన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 6 లక్షల 50 వేల నగదు, ఒక హోండా కారు, 2 బంగారు నగలు, రెండు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరిలించినట్లు ఎల్బీనగర్ ఏసీపీ పృథ్వీధర రావు తెలిపారు.
ఇవీ చూడండి:రాకేశ్‌రెడ్డితో పరిచయమా? ఎంతకాలంగా